ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమనరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు. ఆంధ్రులకు ప్రాత, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడు. గాంధీజీ భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. ఆ మహనీయుడి జయంతి సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఇందులో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
