మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శం. ఆయన పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ పోతే చాలు..కాని చిరంజీవి అలా కాదు ఆయన స్థానంలో వేరెవ్వరు ఉన్నా సరే నా కుటుంబమే బాగుండాలి అని ఆలోచిస్తారు. కాని చిరు ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ నుండి అందరిని ప్రోత్సాహిస్తారు. దీనికి ముఖ్య ఉదాహరణ హీరో నిఖిల్ అని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ఎన్నోసార్లు రిలీజ్ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తరువాత ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరు వెళ్ళడంతో సినిమా హిట్ అవ్వడమే కాకుండా ఇప్పుడు నిఖిల్ మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడట. ఇక తాజాగా నితిన్ హీరోగా వచ్చిన చిత్రం భీష్మ..ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా విషయంలో ఒక సంఘట గురించి వెంకీ భావోద్వేగ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ ఏమిటంటే మెగాస్టార్ భీష్మ చిత్రం చూడడానికి వెంకీని పిలిచి అందులో నచ్చిన సన్నివేశాలు గురించి చర్చించారట. ఇలాగే మంచి కధలతో సినిమాలు తియ్యాలని, నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుందని చిరు హామీ ఇచ్చారట. అంతేకాకుండా చివర్లో షేక్ హ్యాండ్ ఇచ్చి అల్ ది బెస్ట్ చెప్పారట. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.