తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ.
ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది..మిగతా 6 రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేసాయి.సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీ బిల్లును గుడ్డిగా వ్యతిరేకంగా తీర్మానం చేయడం లేదు.పూర్తి అవగాహణతోనే బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాము.50 మందికి పైగా యువత సీఏఏ గోడవల్లో మృత్యువాత పడ్డారు.తాత్కాలికంగా విద్వేషాలను రెచ్చగొడితే దేశానికి మంచిది కాదు.
ఇది హిందూ-ముస్లిం సమస్య కాదు…దేశ ప్రజల సమస్య.కేసీఆర్ లాంటి కోట్ల మందికి బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి?.దేశంలో సరైన బర్త్ సర్టిఫికేట్ లేని పేద కేసీఆర్ లు కోట్ల మంది ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా భారత దేశం ప్రతిష్ట దెబ్బతింటోంది.న్యారోమైండ్ పార్టీలు భారతదేశానికి అవసరమా?.బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అనే బిరుదు ఇస్తున్నారు.!పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్- పాకిస్తాన్ నుంచి ఇండియా కు అనేక మంది వచ్చారు.బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో వేల మంది ఇండియాకు వలస బంగ్లాదేశ్ నుంచి వచ్చారు.బీజేపీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముస్లిం లను మినహాయించి అని బిల్లు తెచ్చింది.సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీ బిల్లుపై కేంద్రం పునర్ పరిశీలించాలని సూచించారు..