గత ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే చివరికి గెలిచాక మీరెవరు అన్నట్టుగా చేతులు దులుపుకున్నాడు. అధికారాన్ని తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. అయితే తాజాగా చంద్రబాబు విషయంలో మరో కోణాన్ని బయటకు తెచ్చాడు ఎంపీ విజయసాయి రెడ్డి. ఆ మరో కోణం గురించి తెలిస్తే ప్రజలు ఛీ అని అనడం ఖాయం. ఇంతకు ఆ విషయం ఏమిటంటే “చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’ అని అన్నారు.
