ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయడంతో అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి. షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా గుత్తా జ్వాల తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పారు. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని గుత్తా జ్వాల సంచలన విషయం చెప్పారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలన్నది నిర్ణయించుకోలేదని.. త్వరలోనే ఒక్కటవుతామని.. అందర్నీ ఆహ్వానిస్తానని గుత్తా తెలిపారు.
