బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. మీరు కూడ అలా అనుకున్నాకరంటే పప్పులో కాటేసినట్లే…ఎందుకంటే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో చేతిలో చెయ్యివేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీజనాలు. వీరి ప్రేమ ముసుపటిలాగే గాఢంగా ఉందట. కాకపోతే కెరీర్ పరంగా అది అడ్డుగా మారే అవకాశముండటంతో కొంతకాలం విడిగా ఉండాలని మాత్రం నిర్ణయించుకున్నారట. కానీ ఎక్కువకాలం దూరంగా ఉండలేకపోయారట. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారట. ప్రేమ గాఢంగానే ఉంది. ఇక వీరిద్దరు పెళ్ళి చేసుకోవడమే తరువాత అంటున్నారు సినీవర్గాలు.
Home / MOVIES / అప్పుడు బ్రేకప్ అన్నారు….ఇప్పుడు రెస్టారెంట్లో అడ్డంగా దొరికారు..ప్రేమ గాఢంగానే ఉందంట
Tags Bolly wood boyfriend Disha Patani' Tiger Shroff