ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచివుండే పరిస్థితి లేకుండా టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకన్ల కేటాయింపు జరుగుతుంది. వివిధ సేవలను ముందుగా బుక్ చేసుకున్న వారికి ఆయా తేదీలను మార్చుకునే అవకాశం టీటీడి కల్పిస్తుంది. అంతేకాకుండా మరోపక్క కరోనా నివారణ కొరకు ఈ నెల 19 నుంచి 21 వరకు శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని నిర్ణయించింది.
