ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. ఇప్పటికే ఆరువేలకు పైగా మంది కరోనా వైరస్ బారీన పడి మృత్యువాత పడితే కమల్ నాథ్ ను కాపాడటం ఏమిటని ఆలోచిస్తున్నారా..?.
అయితే అసలు ముచ్చట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది పార్టీ ఫిరాయించిన సంగతి విదితమే. ఇందులో పద్దెనిమిది మంది రాజీనామాలు చేశారు. అయితే ఈ రోజు బలపరీక్ష నిర్వహించుకోవాల్సిన కమల్ నాథ్ నోట్లో స్పీకర్ చక్కెర పోశారు.
అత్యంత తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన మధ్యప్రదేశ్ రాజకీయానికి మళ్లీ కాస్త బ్రేక్ పడినట్లు అయింది స్పీకర్ నిర్ణయం. ఈ రోజు బలపరీక్ష సందర్బంగా సభను ప్రారంభించిన స్పీకర్ ప్రజాపతి కరోనా ప్రభావంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు సభను వాయిదా వేస్తున్నట్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వానికి మరో పది రోజులు కాస్త ఊరట లభించినట్లైంది.