స్థానిక ఎన్నికల విషయంలో ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాయిదా వేయడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వయంగా సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టి కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. ఇక ఈ విషయంలో అయితే చంద్రబాబు చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఆరువారాగా గడువులో ఏదోకటి చెయ్యాలని బాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. దీనికి స్పందించిన విజయసాయి రెడ్డి “బాబూ… ఆరు వారాలు కాదు, 60 వారాల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగినా నీ అడ్రసు గల్లంతవక తప్పదు.వ్వవస్థల్లో నీ మనుషులున్నారు కదా అని ఎలక్షన్లు నిలిపి వేయించావ్. 5 వేల కోట్ల నిధులు రాకుండా చేసి ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం చేశావు.నీ నీచ రాజకీయాల చరమాంకానికి నువ్వే దారి వేసుకున్నావ్” అని అన్నారు.
