Home / ANDHRAPRADESH / నెట్‌లో విజయవాడ అమ్మాయిల నగ్నచిత్రాల అమ్మకం..కీచకుడి అరెస్ట్..!

నెట్‌లో విజయవాడ అమ్మాయిల నగ్నచిత్రాల అమ్మకం..కీచకుడి అరెస్ట్..!

అమ్మాయిలు సోషల్ మీడియాతో జర జాగ్రత్త..ఈ మధ‌్య సోషల్ మీడియాలో అమ్మాయిలు యాక్టివ్‌గా ఉంటున్నారు. పొద్దస్తమానం సోషల్ మీడియాలో ఉండడం వ్యసనంగా మారింది. రోజూ అందంగా తయారై సెల్ఫీలు, ఫోటోలు దిగి ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం కామనై పోయింది. అయితే కొందరు కామాంధులు, కీచకులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాళ్ల ఫేస్‌తో నగ్నంగా ఉండే ఫోటోలు తయారు చేసి వాటిని ఆన్‌లైన్లో అమ్ముతున్న ఓ కీచకడి వ్యవహారాన్ని సైబరాబాద్‌ పోలీసులు చేధించారు. ఇదిగో పై ఫోటోలో కనిపిస్తున్న వెధవ పేరు వెంకటేష్..ఈ కేటుగాడు విజయవాడలో సీఏ చదువుతున్నాడు.డైలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ఫోటోలు చూసే వీడికి నీచబుద్ధి పుట్టింది. ఆ అమ్మాయిల ఫొటోల్ని డౌన్ లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ ద్వారా నగ్న చిత్రాలుగా మారుస్తున్నాడు. వాటిని తన ఎకౌంట్ లో పెట్టి.. ఫొటోను 300 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. ఇలా రోజుకు 5-6 వేల రూపాయలు సంపాదిస్తున్నాడంట.

 

ఈ కేటుగాడి  వ్యాపారం మూడు మూడు మార్ఫింగ్ ఫోటోలు..ఆరు న్యూడ్ వీడియోలుగా వర్థిల్లుతున్న టైమ్‌లో వీడి పాపం పండింది. ఒకరోజు బంజారాహిల్స్ కు చెందిన ఓ అమ్మాయి ఇలానే తన నగ్న ఫొటోను సోషల్ మీడియాలో చూసి అవాక్కయింది. వెంటనే వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు  తీగ లాగితే డొంక విజయవాడలో కదిలింది. ఈ వెంకటేష్ అనే కీచకుడి ఆగడాలు మొత్తం బయటపడ్డాయి. విజయవాడకు చెందిన ఎంతోమంది అమ్మాయిల ఫోటోలను ఇలా మార్ఫింగ్‌తో న్యూడ్‌గా చేసి అమ్మేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. . అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్ వెళ్లి పబ్ లో ఎంజాయ్ చేసేవాడడినని గొప్పగా చెప్పుకున్నాడు.. ప్రస్తుతం ఈ కేటుగాడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. చూశారుగా అమ్మాయిలు…ఫేస్ బుక్, ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లో అమ్మాయిలు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలు పెట్టి మురిసిపోవడం కాదు..ఇలా మీ ప్రమేయం లేకపోయినా..ఇలాంటి కేటుగాళ్ల వాళ్ల మీ పరువు, మీ ఇంట్లో వాళ్ల పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది..కాబట్టి…సోషల్ మీడియాతో ఇలా ఫోటోలు పెట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచింది.ముఖ్యంగా బెజవాడ అమ్మాయిలు మరీ జాగ్రత్తగా ఉంటుంది. అసలు కాల్‌మనీ కేటుగాళ్లు ఉండే నగరం బెజవాడ…కాబట్టి బెజవాడ అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat