తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయంలో మూడో జరిగిన‘వింగ్స్ ఇండియా-2020’కార్యక్రమానికి సంబంధించి మినిస్టీరియల్ ప్లీనరీలో హర్దీప్సింగ్పూరి పాల్గొన్నారు.
ఈసందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పూరి ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్‌ను యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్‌గా అభివర్ణించారు. నవభారత నిర్మాణానికి కేటీఆర్ ప్రతినిధిగా నిలుస్తారని కొనియాడారు.
‘వింగ్స్ ఇండియా’ నిర్వహణకు మంత్రి కేటీఆర్, ఆయన అధికారుల బృందం తమకు ఎంతగానో సహకరించిందన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.