తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదు. ఎవరు భయపడాల్సినవసరం లేదు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే ఈ వైరస్ సోకుతుంది. ఇక్కడున్నవారికి అది సోకకుండా ఉండేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” సోషల్‌మీడియాలో కొందరు అతిగాళ్లు కరోనా వైరస్ గురించి తమ ఇష్టారీతిన ప్రచారంచేస్తున్నారని, అలాంటివారిపై కఠినచర్యలు తీసుకొంటామని సీఎం హెచ్చరించారు.
వారిని ఎవరూ ఏమీచేయలేరనుకొంటున్నారని, కానీ ఈసారి ప్రభుత్వమంటే ఏమిటో రుచిచూస్తారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం మంచిది కాదని స్పష్టంచేశారు.