చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.
ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న దుబాయ్‌లో నితిన్, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కొద్ది మంది బంధువులు, మిత్రుల మధ్య దుబాయ్‌లో ఏప్రిల్ 15వ తేదీన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి.
అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ నిర్వహించాలని అనుకొన్నారు. అయితే దుబాయ్‌లో కూడా కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.