తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది.
జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు ఆమోదించింది.
తెలంగాణ లోకాయుక్త – 2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ శాసనసభ తీర్మాణం చేసింది. శాసనసభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. అనంతరం పలు సమస్యలపై సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.