తెలంగాణ రాష్ట్రం బాటలో అసోం రాష్ట్రం నడిచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్, స్విమ్మింగ్‌ఫూల్స్, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కృష్ణ తెలిపారు.
ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.