బుద్ధా వెంకన్న.. టీడీపీ అధినేత చంద్రబాబుకు నమ్మిన బంటు అయిన ఈ టీడీపీ ఎమ్మెల్సీకి నోరు తెరిస్తే బూతులే..చంద్రబాబు సీఎం జగన్‌ను, వైసీపీ నేతలను ఏదైనా టాపిక్‌పై తిట్టాలని అనుకుంటే వెంటనే బుద్ధా వెంకన్న రంగంలోకి దిగిపోతాడు. అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా బూతులతో నోరుపారేసుకుంటూ అవాకులుచెవాకులు పేలడంలో బుద్ధా వెంకన్న మాస్టర్ డిగ్రీనే చదివారు. బెజవాడ రాజకీయాల్లో బుద్ధా వెంకన్న అంటే తెలియనవారు ఉండరూ..కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఈయనగారి పేరు మార్మోగిపోయింది. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ కాల్‌మనీ వ్యవహారంలో బుద్దా నాకేం తెలియదంటూ అడ్డంగా బుకాయించి బయటపడ్డాడు. ఏదైనా గొడవలు, అలజడులు రెచ్చగొట్టాలంటే బుద్ధా ముందుంటాడు.
మొన్నటికి మొన్న పల్నాడులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చిన్న ఘర్షణ జరిగితే చంద్రబాబు ఆదేశాల మేరకు బోండా ఉమను వెంటేసుకుని పది కార్లలో అనుచరులతో కార్లలో మాచర్లలో అలజడి రేపాలని వెళ్లి, అక్కడి స్థానిక ప్రత్యర్థులు తిరగబడడంతో బతుకుజీవుడా అంటూ బెజవాడకు వచ్చి నడిరోడ్డుపై సింపతీ డ్రామా ఆడాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించాలని టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు..తాజాగా బుద్ధా వెంకన్న మరో మాస్టర్ ప్లాన్ వేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయడంలో అధికారులు లేట్ చేశారని, దీంతో కొన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారంటూ బుద్ధా వెంకన్న హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. బుద్దాగారి బుద్ధిలేని పిటీషన్‌ను హైకోర్ట్ కొట్టివేయడంతో పాటు , రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చొద్దు అంటూ చీవాట్లు పెట్టింది. అసలు ఈ పిటిషన్ ఎందుకు వేసినట్టు? ఈ విషయంలో నీకు ఏం సంబంధం? అని కోర్టు బుద్ధాకు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసి చుక్కలు చూపించించదంట.. అయితే నిజంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే అభ్యర్థులు కోర్టుకు రావాలి తప్ప, ఏ అర్హతతో నువ్వు కోర్టుకు వచ్చావు అని బుద్ధావెంకన్నను న్యాయస్థానం ప్రశ్నించిందంట.. ఈ ప్రశ్నలకు బుద్దా తరఫు లాయర్ జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలాడంట..ఇంకోసారి రాజకీయ ఆరోపణలతో తమ విలువైన సమయాన్ని వృధా చేస్తే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హైకోర్టు బుద్ధాను హెచ్చరించిందంట..మొత్తంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు లేటు పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడానికి బుద్ధాతో చంద్రబాబు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. హైకోర్ట్ క్లాస్‌తో బుద్ధా వెంకన్న చిన్నబుచ్చుకున్నట్లు సమాచారం. దీంతోె నువ్వు బుద్ధా వెంకన్నవా..బుద్ధిలేని వెంకన్నవా..నువ్వసలు మారవా అంటూ నెట్‌జన్లు సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు.అదీ సంగతి.