ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని కేంద్ర సర్కారు పేర్కొంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో ముప్పై ఒకటి కేసులు నమోదయ్యాయి.
అయితే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,760 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తెలంగాణ. ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాఠశాలలు, కళాశాలలకు,మిగిలిన జనసముహాం ఉండే ప్రదేశాలను మూసివేయాలని నిర్ణయించాయి.