Home / ANDHRAPRADESH / ఏపీలో కరోనా కట్టడికి మినీ ఎమర్జెన్సీ !

ఏపీలో కరోనా కట్టడికి మినీ ఎమర్జెన్సీ !

కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం నుంచే ఈ చట్టం రాష్ట్ర మొత్తం అమలులోకి వచ్చింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌కు మరిన్ని అధికారాలు అప్పగించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌, వైద్యాధికారి, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు పూర్తిగా కరోనా నియంత్రణ కోసం పని చేయాలి.

 

 

అవసరమైన చోట ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసుకుని అనుమానితులను చికిత్స అందించాలి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాససంబంధింత వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండాలి. అనుమానుతులను 14 రోజులు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. వైద్య సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా మీడియాకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అందిస్తే దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. అలాగే కరోనా లక్షణాలున్న వారిని సెక్షన్‌-6 ప్రకారం సంబంధింత అధికారాలున్న వారు మాత్రమే చేర్చుకోవాలి. అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు. ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ప్రవేశాల నిషేధం, పాఠశాలలు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ సమావేశాలను నియంత్రించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం శిక్షార్హులుగా ప్రభుత్వం పేర్కొన్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat