టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి.. లేట్ వయస్సులో కూడా అందాలను ఆరబోసే అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ నక్క తోక తొక్కింది. సందేశాత్మక చిత్రాలను తరెక్కెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సంగతి విదితమే.
ప్రస్తుతం ఈ చిత్రం నుండి హీరోయిన్ గా ఎంపికైన చెన్నై అందాల భామ త్రిష తప్పుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించింది. అయితే త్రిష స్థానంలో లేట్ వయస్సు అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై అధికారకంగా త్వరలోనే ప్రకటన రానున్నది. గతంలో కాజల్ అగర్వాల్ చిరుతో ఖైదీ నెంబర్ 150లో ఆడి పాడిన సంగతి విదితమే.