కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్‌తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా భారత్ ను సహాయం కోరడం జరిగింది. ఈ మేరకు దానికి సబంధించి చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి రవీష్ కుమార్ అన్నారు.