కరోనా వైరస్‌తో ప్రపంచమంతా చావు భయంతో వణికిపోతుంటే..మన బాహుబలి మాత్రం షూటింగ్ కోసం యూరప్ వెళుతున్నాడు. ఎంత బాహుబలి అయితే మాత్రం మరీ ఇంత వైపరిత్యమా..విదేశాలకు వెళ్లవద్దని ప్రభుత్వం చెబుతుంటే..ప్రభాస్ మాత్రం షూటింగ్ కోసమని జార్జియా వెళ్లాడు. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్‌కు ఏమైనా పిచ్చిపట్టిందా..ఏంటీ మతిలేని పని అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్‌తో పాటు..హీరోయిన్ పూజా హెగ్డే కూడా జార్జియాకు వెళ్లింది..ఈ అమ్మడు అయితే ఏకంగా ముఖానికి మాస్క్ పట్టుకుని..ఎయిర్‌పోర్ట్‌లో ఫోటో దిగింది..ఇద్దరూ కలిసి షూటింగ్ మొదలుపెట్టింది కాక..ప్రస్తుతం ప్రస్తుతం షూటింగ్ స్పాట్ లో 10 డిగ్రీల చలి ఉంది. దీనికి తోడు వాన కురుస్తోంది. కరోనా వ్యాప్తి చెందడానికి ఇది ఎంతో అనుకూలమైన వాతావరణం. అయినప్పటికీ “మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. టీమ్ స్పిరిట్” అంటూ యువీ టీమ్ కొటేషన్లు పెడుతూ పని కానిచ్చేస్తున్నారు.
బాహుబలి మరీ ఇంత బాధ్యతారాహిత్యమా…ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలను కరోనా వణికిస్తుంటే..ఇప్పుడు యూరప్‌లో షూటింగ్ పెట్టుకోవడం అవసరమా..అక్కడ మీ అందరూ కరోనా తగిలించుకుని, ఇండియాకు వచ్చి ..ఎంత మందికి అంటిస్తారంటూ సినీ అభిమానులు మండిపడుతున్నారు..ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ హీరోను దయచేసి వెంటనే అక్కడ నుంచి తిరిగి వచ్చేయని కోరుతున్నారు. సిన్మా ఒక ఏడాది లేట్ అయినా ఫర్వాలేదు..నువ్వు క్షేమంగా ఉంటే చాలు..త్వరగా వచ్చేయన్నయ్య అంటూ ప్రభాస్‌ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా షూటింగ్ ఆలస్యమైంది…ఇప్పుడు కరోనా పేరుతో వాయిదా వేసుకుంటే..మరి కొద్ది రోజులు లేట్ అవుతుందని ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని అటు ప్రభాస్‌పై, ఇటు యువీ టీమ్‌పై ట్విట్టర్‌లో తెగ కామెంట్స్ పడుతున్నాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంటే.. నీ డ్యాన్సులు, ఫైట్లు ఏంటీ ప్రభాస్..ఇదేం పద్దతిగా లేదంటూ నెట్‌జన్లు తెగ క్లాస్‌తీసుకుంటున్నారు.