కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో ఆపిల్ మార్చి 27 వరకు చైనా వెలుపల తన స్టోర్స్ అన్నింటినీ మూసివేస్తున్నట్లు సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఆపిల్ యొక్క ఆన్లైన్ స్టోర్ తెరిచి ఉంటుంది, అయితే చైనా వెలుపల కార్యాలయ సిబ్బంది వీలైతే రిమోట్గా పనిచేస్తారని కుక్ తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థకు ప్రపంచంలోని 24 దేశాలలో 500 దుకాణాలు ఉన్నాయి. స్టోర్స్ ముసేసినప్పటికీ, ఉద్యోగులకు సాధారణ వేతనం కొనసాగుతుందని కుక్ చెప్పారు.