స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పట్టు సాధించింది. ఎవరూ ఊహించని విధంగా చంద్రగిరి పరిధిలోని మొత్తం 95 ఎంపీటీసీల్లో 75 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మిగిలిన 19 స్థానాల్లో నామినేషన్ల ఉప సంహరణ నాటికి ఏం జరుగుతుందనేది చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠగా మారింది. చంద్రబాబు కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సొంతూరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. అందుకే చంద్రగిరి నియోజకవర్గం బాబుకు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచి చంద్రబాబుకు చెక్ పెట్టారు. అంతే కాదు చంద్రగిరిని వైసీపీ కోటగా మల్చారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 75 స్థానాలు ఏకగీవ్రంగా వైసీపీ గెల్చుకోవడం చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది.
చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె స్థానాన్ని కూడా ఏకగ్రీవంగా వైసీపీ గెల్చుకుందని తెలుస్తోంది. కాని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు పోటీ కూడా చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల నుండి తప్పుకోవడం చంద్రగిరి నియోజకవర్గంలో హాట్‌టాపిక్‌గా మారింది. అధికార పార్టీ వైసీపీ అధికార దుర్వినియోగం చేసిందని, బెదిరింపులకు పాల్పడ్డారని, అందుకే తమ పార్టీ నేతలు పోటీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం టీడీపీ ఆరోపణలను కొట్టిపారేస్తుంది. తాము ఎక్కడా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని..టీడీపీ నుండి పోటీకి అభ్యర్దులే ముందుకు రాలేదని చెబుతున్నారు. తాము అడ్డుకుంటే మిగిలిన 19 స్థానాల్లో మాత్రం టీడీపీ అభ్యర్దులు ఎలా పోటీలో ఉంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో..వైసీపీ ఏకపక్షంగా గెలుచుకొనే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఆధిపత్యం కోసం ఏకంగా ఎంపీ రెడ్డప్పకు బాధ్యతలు అప్పగించారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు చంద్రగిరిలో మెజారిటీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడడంతొో కుప్పంలో కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ సత్తా చాటే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇంత కంటే ఘోర అవమానం ఉండదు. మొత్తంగా సొంతూరిలో చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురవడం చిత్తూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.