స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గుంటూరు జిల్లాతో మొదలన వలసల పర్వం..కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి విశాఖలో షురూ అయింది. ఇప్పటికే డొక్కా టీడీపీ మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, రామసుబ్బారెడ్డిలు, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, పాలేరు రామారావులతో పాటు ప్రస్తుత చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. త్వరలో టీడీపీ ఎమ్మెల్సీలు, కేఈ ప్రభాకర్, శమంతకమణితో పాటు, మాజీ ఎమ్మెల్పీ సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే యామిని బాలతో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరనున్నారు.
అయితే తాజాగా విశాఖలో వలసల పర్వం షురూ అయింది. విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పిఎల్‌ఎస్‌ఎన్ ప్రసాద్, టీఎస్‌ఎన్ మూర్తి, రజక సంఘం నార్త్ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు అమరావతికి జై కొట్టి విశాఖపై విషం చిమ్మడంపై వైజాగ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ప్రజా చైతన్యయాత్ర పేరుతో విశాఖలో అమరావతి ఉద్యమాన్ని రగిలించాలన్న చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకుని చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి తిప్పిపంపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. త్వరలో ఇద్దరు లేదా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతున్నట్లు విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా విశాఖలో కూడా వలసలు షురూ అవడంతో చంద్రబాబు బేజారు అవుతున్నాడు.