ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో అగ్ర దేశమైన చైనాలో పుట్టిన ఈ వైరస్ అలా పాకుకుంటూ ఇండియాకు కూడా చేరుకుంది. ఈ వైరస్ కు సంబంధించి మరణించినవారు మరియు ఇంకా కొన్ని కేసులు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క ఎక్కడికక్కడ జనసంచారం లేకుండా ఉండేలా ఆర్డర్ పాస్ చేసారు. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట ఇది త్వరగా పాకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో క్రీడలు, స్కూల్స్ ఇలా అన్ని విభాగాలకు సెలవులు ప్రకటించారు. ఇవన్నీ పక్కనపెడితే జైళ్ళు విషయానికి వస్తే..ఇక్కడ ఖైదీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూడా ఎవరికైనా సోకితే ఇది చాలా ప్రమాదమని చెప్పాలి. తాజాగా తిహార్ జైల్లో ఐసోలేటెడ్ వార్డ్ లను పెట్టడం జరిగింది.
