తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలను మార్చాలని నిర్ణయించిన సంగతి విదితమే.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీకు రూ.5 లక్షలను ప్రతి ఏడాది కేటాయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం 2020-21నుండే అమలు కానున్నది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దీన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన విడుదల చేస్తోన్న నిధుల్లో రూ.5లక్షల కంటే తక్కువగా ఉంటే మిగిలిన మొత్తాన్ని కలిపి ఇచ్చేలా ఉత్తర్వులను వెలువడ్డాయి.