గత ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని ముందే గమనించిన చంద్రబాబు అప్పుడు అధికార బలంతో ప్రజలకు డబ్బు రుచి చూపించి ఓటు బ్యాంకు మొత్తం తనవైపు తిప్పుకోవాలని విశ్వప్రయత్నాలు చేసాడు. 2014 ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్లాన్ వేసి గెలిచాక ప్రజలను నమ్మించి మోసం చేసారు. ఈసారి కూడా అదే ప్లాన్ తో దిగిన బాబు ప్రజలు మళ్ళీ డబ్బు రుచి చూపిస్తే మారిపోతారు అనుకున్నాడు. కాని ఈసారి బాబు ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కదా తిరిగి బాబుకే తేడా కొట్టింది. ప్రజలు అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. దాంతో తట్టుకోలేని చంద్రబాబు అన్యాయంగా గెలిచారని మొదలుపెట్టాడు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో అక్రమాలు, అరాచకాల గురించి చంద్రబాబు సుద్దులు చెబుతున్నాడు. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించిన చరిత్ర నీది కాదా? మాపార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను బెదిరించి జెడ్పీలను, ఎమ్మెల్సీ పదవులను లాక్కుంది ఎవరు? గెలిచే పరిస్థితి కనిపించకపోవడంతో ఇప్పుడు బురద చల్లుతున్నావు” అని మండిపడ్డారు.
