తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి వ్యవహారం లోక్ సభలో కూడా ప్రస్తావనకు వచ్చింది.ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. దీనిపై టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు స్పందిస్తూ “చట్టబద్దంగానేపోలీసులు కేసు పెట్టారు. అందుకే రేవంత్ ను అరెస్టు చేశారని టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు.
రేవంత్ డ్రోన్ కెమెరాలను వాడడం ద్వారా వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించారని ఆయన అన్నారు. చట్టలు చేసే ఎమ్.పినే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా అని అన్నారు. రేవంత్ విషయం కోర్టులో ఉందని ఆయన అన్నారు.
కాగా రేవంత్ చర్యలను పౌర విమాన యాన శాఖ మంత్రి దృష్టిక కూడా నామా నాగేశ్వరరావు తీసుకు వెళ్లారు. విమానయాన చట్టాన్ని రేవంత్ ఉల్లంఘించారని అందువల్ల ఆయనపై చర్య తీసుకోవాలని నామా ఈ సందర్భంగా కోరారు.