కరోనా ఇప్పుడు ఎక్కడ విన్న కానీ ఈ పేరే విన్పిస్తుంది.ప్రస్తుతం ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ప్రభావంతో గజగజ వణుకుతుంది.దీని ప్రభావం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీపై పడింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీలో బన్నీ హీరోగా .. అందాల బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తుంది.
శేషాచలం అడవుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మూవీలో దాదాపు సగభాగం అటవీ నేపథ్యంగానే తెరకెక్కించాల్సి ఉంది. కేరళ రాష్ట్రంలోని అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ జరగాల్సి ఉంది. ఇందుకు ఇప్పటికే లోకేషన్లు కూడా ఎంపిక చేశారు.
అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ భీభత్సం సృష్టిస్తోన్న నేపథ్యంలో అక్కడ షూటింగ్ చేయడం కుదరలేదు అని సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్ ఏపీకి మార్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మారేడు మిల్లి అడవుల్లో కొన్ని సీన్లు చేయాలని చిత్రం యూనిట్ భావిస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కేరళలో షూటింగ్ జరుపుకోనున్నది.