కర్నూల్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయ్యెటట్లు ఉంది. భారీగా వైసీపీ లోకి వలసలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అయితే ఒకపక్క తన సొంత తమ్ముడే టీడీపీని వీడిన నేపద్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి మున్సిపల్ ఎన్నికలలో చేతులు ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది. డోన్ మున్సిపల్ ఎన్నికలలో తాము పోటీ చేయబోవడం లేదని కృష్ణమూర్తి ప్రకటించారు. ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్దులను భయబ్రాంతులను చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే అవకాశం లేనందున తాము పోటీ చేయడం లేదని కృష్ణమూర్తి అన్నారు.
