తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు విక్రమార్క భట్టీపై ఫైర్ అయ్యారు. ముందుగా భట్టీ మాట్లాడుతూ”ఉమ్మడి ఏపీలో వచ్చిన నీలం తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పా ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. ప్రాజెక్టులు కట్టింది మేమే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి కట్టలేదు అని అసత్యప్రచారం చేశారు. దీనిపై మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”భట్టీ గారు సభను పక్కదోవ పట్టిస్తున్నారు. సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నీలం తుఫాన్ వస్తే నష్టపోయిన ఖమ్మం ,వరంగల్ జిల్లా రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వమని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాంబర్ ముందు నినాదాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి” మిస్టర్ హారీష్ రావు మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వను పో అని అనడమే కాకుండా చాంబర్ ముందు కూర్చున్న మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు.
అప్పుడు పదవుల్లో ఉన్న మీరు అన్ని మూసుకుని కూర్చున్నారే కానీ నోరు తెరిచి ఏమి మాట్లాడలేదు.తెలంగాణ రాష్ట్రమోచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఇన్ ఫుట్ సబ్సిడీ బకాయిలను విడుదల చేసింది అని ఆయన ఫైర్ అయ్యారు. ఆయన ఇంకా మాట్లాడుతూ భట్టీ ఐయామ్ ఛాలెంజింగ్.ఐయామ్ హియర్.అంటూ మీరు కట్టిన ప్రాజెక్ట్ లలో నీళ్ళిచ్చినరా ఎప్పుడన్నా..ఇప్పుడు పోదామా కాలువల చుట్టూ..చివరి ఆయకట్టు వరకు పోదామా..? నీళ్ళు పోతున్నయో లేదో చూద్దామా..మీరు ఎస్సారెస్పీ కాలువల్లో తుమ్మలు మొలిపిస్తే..మేం వాటిని శుభ్రపరిచి నీళ్ళిచ్చాం..అడ్డగోలుగా మాట్లాడితే ఎలా..ఎల్లంపల్లిని మీరు మరిస్తే నీళ్ళు నింపిన ఘనత తెలంగాణా ప్రభుత్వానిది..
ఎస్సారెస్పీ నిండుకుండలా కలకలలాడుతుంది..మేడిగడ్డ ద్వారా నీళ్ళు ఇవ్వలేదని భట్టీ అంటున్నారు..మేడిగడ్డ ద్వారా నీళ్ళు వచ్చినయో లేదో ప్రజల రైతుల కళ్ళముందింది..నాడు మీరు అదికారంలో ఉన్నారు..మరి రైతు బందు ఇవ్వాలనే సోయి మీకెందుకు లేదు..? నాడు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనే సోయి ఎందుకు రాలేదు..? నేడు మేం ఇచ్చాం కాబట్టే ప్రజలు మమ్ముల గుండెల పెట్టుకున్నరు..నాడు కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణాకు చుక్క నీరు ఇయ్యనన్నప్పుడు అప్పుడు మీరే అక్కడ కూచోని బల్లలు గుద్దింది..తెలంగాణా కోసం పదవులు త్యాగం చేసి ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర మాది…పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నాం..మీలా పదవుల కోసం పాకులాడలే..మీలెక్క ప్రాజెక్ట్ లు మొదలు పెట్టకుండానే అడ్వాన్స్ లు ఇయ్యలే.. మీ లాగా ఇండ్లు కట్టకుండనే బిల్లులు లేపలే..మేం ప్రాజెక్ట్ లు కట్టినం పనులు చేసినం.. మేం సంపద పెంచి పేదలకు పంచుతున్నం..ప్రతీ ఇంటిలో సంక్షేమం అందుతుంది..మాది ప్రజాపక్షం..మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశ్యం ప్రజాసంక్షేమం అని అన్నారు.