ఒక సినిమా తియ్యాలంటే ఎంత కష్టపడాలో అది ఒక దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్న కధకి ఒక నిర్మాతను వెతకాలి, హీరోని ఒప్పించాలి ఆ తరువాత దానిని ఆచరణలో పెట్టి చివరి హిట్ టాక్ తెప్పించాలి. హిట్ టాక్ రాకపోతే కలెక్షన్లు రావు, అది నిర్మాతకు పెద్ద దెబ్బ. ఇంత కష్టబడి సినిమా తీస్తే బయటకు వచ్చేసరికి సీన్ సితారే. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు కూడా ఆడకుండానే ఓటీజీ ప్లాట్ ఫామ్ పుణ్యమంటూ బయట వచ్చేస్తుంది. అమెజాన్, నెట్ ఫ్లిక్ష్ రూపంలో బయటకు రావడంతో ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెలరోజుల తరువాత ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం అవ్వాల్సిందే. అయితే అసలు విషయానికి వస్తే ఇప్పుడు నెలరోజులు కాదు రిలీజ్ రోజునే ఇందులో చూసే రోజులు వచ్చాయి. ఎందుకంటే ఇదంతా కరోనా మహిమ అని చెప్పాలి. కరోనా దెబ్బకు దేశంలో ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి. ఇక రెండు మూడు రోజుల్లు అన్నీ మూసేసే అవకాసం ఉంది. దాంతో ఇక ఓటీజీ ప్లాట్ ఫామ్ కు పండగ అనే చెప్పాలి.