ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు గూగుల్ సంస్థ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించింది.
ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కొన్ని గంటలు అతను ఆఫీసులో విధులు నిర్వర్తించాడని పేర్కొంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తించాలని ఇతర ఉద్యోగులను కోరింది.
అలాగే కరోనా సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారు స్వీయ నిర్భందంలో ఉండాల్సిందిగా సూచించింది. కాగా, కరోనా సోకిన వ్యక్తి ఇటీవల గ్రీస్ దేశానికి వెళ్లి వచ్చినట్టుగా తెలుస్తోంది.