ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఎక్కువశాతం సినీ పరిశ్రమపై పడింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ టాలీవుడ్ ను కలవరపరుస్తుంది. బయట దేశాలలో షూటింగ్ లు పెట్టుకునేవారికి ఇప్పుడు అవన్నీ వాయిదా వేసుకోక తప్పదని చెప్పాలి. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో ఇటలీ నుండి వచ్చిన ఒక విద్యార్ధికి వైరస్ ఉందనే అనుమానంతో చెకప్ చేయించగా అతడికి వైరస్ సోకినట్లు వైద్యులు తెలిపారు. దాంతో నెల్లూరులో థియేటర్లు మొత్తం మూసివెయ్యాలని అధికారులు ఆదేశించడంతో అన్నీ బంద్ చేసారు.
