ఐపీఎల్ రద్దు అయ్యిందని చెప్పి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు చేయడం జరిగింది. కరోనా వైరస్ భాదితులు ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిగతా రెండు మ్యాచ్ లు లేనట్టే. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ సైతం ఆపేశారు.
