యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏది ఎలా ఉండబోతుంది అనేది శనివారం జరిగే మీటింగ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే విదేశీ ఆటగాళ్ళు రాకుండా వీసా ఆంక్షలు విదించిన విషయం తెలిసిందే.
