ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నిన్న కరోనా భారిన పడి బెంగుళూరుకు చెందిన ఒక పెద్దాయన మరణించాడు. ఇండియా లో కరోనా వైరస్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తి అతడే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే రేపటి నుంచి వారంరోజుల పాటు కర్ణాటకలో థియేటర్లు మరియు పబ్లిక్ ప్రాంగణాలు మూసివెయ్యాలని నిర్ణయించారు.
