తెలుగుదేశం అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో తెలుగు తమ్ముడు షాక్ ఇవ్వనున్నారా…?. ఇప్పటికే ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు పలువురు టీడీపీని వదిలి వైసీపీలో చేరుతున్నారు.
వీరి బాటలో నడవడానికే కర్నూలు జిల్లా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలోచనలు చేస్తున్నారా..?. అంటే అవుననే అన్పిస్తుంది ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తన జిల్లాలో తన వర్గానికి చెందిన వారికి టికెట్ల కేటాయింపుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ అసంతృప్తిలో ఉన్నారు.
ఇందులో భాగంగా తన అనుచరులు,పార్టీకి చెందిన కీలక నేతలు,కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు సన్నద్దమవుతున్నారు. అయితే కేఈ ప్రభాకర్ పార్టీ మారడానికే ఈ అడుగులు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి