ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారానికి పది సంవత్సవరాలు అవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లో వేడకలు నిర్వహించారు. ఈ మేరకు కర్నూల్ జిల్లా పత్తికొండ వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు జెండాను ఆవిష్కరించి నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10 వ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పార్టీ జండాను ఎగురవేసిన నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ 9 సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ ప్రజలకు ఏ విధంగా సేవలందించింది, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కొరకు పార్టీ ఏ విధంగా కృషి చేస్తుందనే విషయాలను పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బజారప్ప, జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, జిల్లా ప్రధాన కార్యదర్శి లలితా రామచంద్ర, రెహ్మాన్, నరసింహాచారి, బాబులు రెడ్డి, కోటి, దాసు, నజీర్, బొంబాయి శీను మరియు పత్తికొండ మండలం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
