హీరో రామ్ వరుస ఫ్లాప్ ల తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పూరికి కూడా బాగా కలిసొచ్చింది. ఈ సినిమా అనంతరం ఇప్పుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో రామ్ సరసన నివేతి పెతురాజ్ నటిస్తుంది.దీనికి గాను మణిశర్మ సంగీతం అందించగా..స్రవంతి రవి కిశోర్ నిర్మాణ భాద్యతలు తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. అదే రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ మేరకు డేట్ కూడా రిలీజ్ చేసింది.