యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో “విద్యావంతుడు మరియు దయగల యువకుడిని” చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే తన ప్రణాళిక వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే వస్తుంది అన్నారు.