భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారు ఉండరు. తన ఆటతో అందంతో అందరిని ఆకట్టుకుంది. సానియాకు పెళ్లి అని వార్త రాగానే వెంటనే అభిమానులు తన ఇంటి ప్రాంగణంలో ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాని మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సానియా తాజాగా తన ఇంస్టా అకౌంట్ లో ఒక పిక్ అప్లోడ్ చేసింది. అందులో ఒక చేతితో కొడుకుని మరొక చేతితో రాకెట్ పట్టుకొని ఉన్న పిక్ ను షేర్ చేసింది. అంతేకాకుండా ‘ఒకే చిత్రంలో నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి వీడు నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు’ అని మంచి క్యాప్షన్ పెట్టింది. అది నెటీజన్లు ఆకట్టుకునేల చేసింది. దాంతో ఆమెపై నెటీజన్లు ప్రసంసల జల్లు కురిపించారు.