సమంత అక్కినేని..సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అనంతరం చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం సినిమాల విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది వచ్చిన ఓ బేబీ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా వచ్చిన చిత్రం 96 రీమెక్ జాను. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ కాస్తా డీలా పడిందని చెప్పాలి. మరోపక్క విమర్శలు కూడా గుప్పించడం మొదలు పెట్టారు. దీనిపై స్పందించిన సమంత ఒక హీరో వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు తీసి నాలుగో సినిమా హిట్ అయితే పట్టించుకోరు. అదే హీరోయిన్ విషయానికి వస్తే ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు.