మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం ఇప్పటికే ఉంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని జనాలు లేకుండానే జరిగేలా కనిపిస్తుంది. ముంబై లో అయితే టికెట్లకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఇలా అయితే ఫుట్ బాల్ తరహాలోనే ఐపీఎల్ కూడా నడుస్తుంది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మ్యాచ్ లు నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి.