తెలుగుదేశం పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు భారీ షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కరణం బలరాం ఆయన తనయుడు వెంకటేష్తో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి కూడా ఆ పార్టీ విధానాలు నచ్చక చంద్రబాబు మాట తప్పే నైజం నచ్చక టిడిపి కి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఒంగోలు మేయర్గా కారణం తనయుడు వెంకటేష్ ను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీ లో కి చేరితే టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టు అవుతుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట ప్రకారం టిడిపి ఎమ్మెల్యేలు ఎవరికి పార్టీ కండువా కప్పి తన పార్టీలో చేర్చుకుని మర్యాదపూర్వకంగా కలవవచ్చు అని సంకేతాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా కరణం బలరాం చేరికతో ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
