అడవికి రాజు ఎవరూ అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం సింహం. సింహం అంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. అది పంజా విసిరితే ఒక్కదెబ్బకే స్పాట్ లో మరణిస్తారు. అలాంటి సింహం స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుందట. జనాలు ఎవరైనా కనిపించిన వారిని ఏమీ అనడంలేదట. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని వెతికి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. నిజానికి అది సింహం కాదట అది కుక్క అని క్లారిటీ ఇచ్చారు. హెయిర్ కటింగ్ ఆ విధంగా ఉండడంతో అందరు అలా అనుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.