ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను నమ్ముకున్నవారికి న్యాయం చేయడంలో తనకు తానేసాటి.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు వదులుకున్న కావటి మనోహరనాయుడుకి గుంటూరు మేయర్ సీటు ఇచ్చారు. ఉప్పల రాంప్రసాద్ కుటుంబంలో కృష్ణా జిల్లా చైర్ పర్సన్ ఇచ్చారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎమ్మెల్యే సీటు వదులుకున్న కవురు శ్రీనుకు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మెన్ అవకాశమిచ్చారు. అలాగే తన మాట విని మండలి రద్దుకు సహకరించి తమ మంత్రి పదవులను వదులుకున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ లకు రాజ్యసభ పదవులు ఇచ్చారు. పార్టీ అధినేత ఆదేశాలు అమలుచేసిన ఎందరికో మంచి అవకాశాలు రావడం నిజంగా వైసీపీ శ్రేణులకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.
