Home / ANDHRAPRADESH / మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!

మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఓటుకు నోటుకు స్కెచ్ వేస్తున్నాడా…అందుకే ఓడిపోయే సీటు అని తెలిసినా..డబ్బుతో కొనుగోలు చేయచ్చు అనే కుటిలపూరిత ఆలోచనతో వర్ల రామయ్యకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడా…తన అక్రమ డబ్బుతో మరోసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నాడా..ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మరోసారి ఓటుకు కోట్లుకు స్కెచ్ వేస్తున్నట్లు అర్థమవుతుంది. రాజ్యసభ ఎంపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ 4 గురు అభ్యర్థులను ప్రకటించింది. అసెంబ్లీ 151 సీట్లతో పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో వైసీపీ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే టీడీపీకి సభలో కేవలం 23 మంది సభ్యులే ఉన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ పార్టీకి రాజీనామా చేసినందున వారు వైసీపీ అభ్యర్థులకే ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో టీడీపీకి కేవలం 21 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. వీరిలో కూడా సొంత పార్టీకి ఓటు వేస్తారనే గ్యారంటీ లేదు. తమ విచక్షణతో కొందరు వైసీపీ అభ్యర్థులకే మద్దతు ఇవ్వచ్చు. అయినా చంద్రబాబు ఏ ధైర్యంతో వర్ల రామయ్యను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

అసలు తెలుగు రాజకీయాల్లో ఓట్లను డబ్బులతో కొనే విష సంస్కృతి చంద్రబాబుతోనే మొదలైంది. నంద్యాల ఉప ఎన్నికల్లో నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ నాకు ఓటేయ్యరా..నేను ఇచ్చిన పింఛన్ తీసుకుంటూ నాకు ఓటేయ్యారా..అవసరమైతే ఓటుకు పదివేలు ఇచ్చైనా కొనే దమ్ము నాకుందంటూ ప్రజల ముందు బహిరంగంగా ప్రకటించుకున్న ఘనుడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలాగే తనకు బలం లేకున్నా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపాడు. ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీ‎ఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నాటి కేసీఆర్ సర్కార్‌ను కూలదోయాలని చంద్రబాబు పన్నాగం పన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే..ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఓటు కీలకంగా మారింది. దీంతో ఆయనకు 5 కోట్లు ఇచ్చి తమ పార్టీకి ఓటు వేయించుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ మేరకు ముందుగా తనకు విశ్వాసపాత్రుడైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి 50 లక్షలు ఇచ్చి పంపాడు. అంతే కాదు ఏకంగా స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడాడు. మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ, డోంట్ బాదర్.. వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్….వుయ్ విల్ వర్క్ టుగెదర్ అంటూ ఫోన్‌లో మాట్లాడి తెలంగాణ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఆ తర్వాత తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రగలడంతో కేంద్రం జోక్యంతో ఆ కేసు సద్దుమణిగింది. కాని ఇప్పటికీ ఓటుకు నోటు కేసు చంద్రబాబు మెడపై కత్తిలా వేలాడుతూనే ఉంది.

 

కాగా మరోసారి ఏపీ రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక రాజ్యసభ ఎంపీ గెలవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి వస్తుంది. కానీ సభలో టీడీపీ బలం కేవలం 21 కే పరిమితమైంది. అయినా చంద్రబాబు వర్ల రామయ్యను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాడంటే..దీని వెనుక మరోసారి ఓటుకు కోట్లు కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు 20 నుంచి 50 కోట్లు ఇచ్చి అయినా ఓటు వేయించుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. అవసరమైతే ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇవ్వడానికి కూడా బాబు వెనకాడడు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలలో చంద్రబాబు విసిరే కోట్లకు ఆశపడే వారు కనిపించడం లేదు. దీంతో మరోసారి చంద్రబాబు బొక్కబోర్లా పడడం ఖాయంగా కనిపిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat