మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు.
అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో నెలకొన్న పరిణామాలను అంచనా వేసిన ఆ ఇరవై మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు తరలిపోయారు. వీరంతా సింధియా మద్ధతుదారులు కావడం విశేషం. ఇందులో ఆరుగురు మంత్రులు ఉన్నారు.వీరంతా సింధియా నేతృత్వంలో బీజేపీలో చేరతారు. సింధియాకు కేంద్ర మంత్రి పదవీ వస్తుందని అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి.