Home / ANDHRAPRADESH / స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

 వివాదాస్పద టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మావాడే అని చెబుతూ చంద్రబాబును వరస్ట్ సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా వైసీపీని ఓడించలేవు… స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది మావాడే అంటూ జేసీ కుండబద్ధలు కొట్టారు. ఒకవేళ ఎన్నికల్లో ఇతర పార్టీల వారు గెలిచినా వారిని డబ్బు, మద్యం పంచారని చెప్పి జైలుకు వెళ్లాల్సిందేనని ఆ దిశగా సీఎం జగన్ స్కెచ్ వేశారంటూ జేసీ చెప్పుకువచ్చాడు. అందుకే టీడీపీ ఎంత గింజుకున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే దండగ అని..ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని జేసీ తెలిపారు. వేరే పార్టీల నుంచి గెలిచినా వారిని వైసీపీలోకి లాగేయడమో లేదా మందు, డబ్బులు పంచారంటూ జైలుకు పంపడమో చేస్తారని అందుకే స్థానిక సంస్థల ఎన్నిలల్లో మా వాళ్లతో పాటు చంద్రబాబును కూడా పోటీచేయద్దని కోరినట్లు జేసీ చెప్పారు.

అయితే 2024లో చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని..జేసీ జోస్యం చెప్పాడు..ఇప్పుడు జగన్ చేస్తున్న రాజకీయం కంటే చంద్రబాబు రాజకీయం మరింత దారుణంగా ఉంటుందని…ఎవరూ తట్టుకోలేని జేసీ చెప్పుకొచ్చాడు. 2024లో చంద్రబాబులో వరస్ట్ సీఎంను చూస్తారని జేసీ పేర్కొన్నాడు. అయితే జేసీ వ్యాఖ్యలు కాస్త విచిత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే జగన్ వ్యూహాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అమరావతి ఉద్యమం నేపథ్యంలో టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమలో పూర్తిగా దెబ్బతింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. 2024 నాటికి జగన్ మరింత శక్తివంతం అవుతాడు.ఇప్పటికే జగన్ దెబ్బకు టీడీపీ సగం ఖాళీ అయింది. ఈ నాలుగేళ్లలో జగన్ వ్యూహాల ముందు టీడీపీ పూర్తిగా కుదేలవడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడు రాజధానుల ఏర్పాటు వివాదంతో ఏపీలో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు, ఎల్లోమీడియా భ్రమల్లో ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు జగన్‌ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. కేవలం కొద్ది పట్టణ ప్రాంతాల్లో తప్పా..గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఇంకా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ 2024 నాటికి అధికారంలోకి వస్తాడని జేసీ చెప్పడం కాస్త అతిశయోక్తి అనే చెప్పాలి. జగన్ ఇస్తున్న షాక్‌లతో జేసీ తాతకు ఏమైందో ఏమో కానీ 2024లో చంద్రబాబు సీఎం అవుతాడు..రాజకీయం దారుణంగా ఉంటుంది..వరస్ట్ సీఎంగా చూస్తారంటూ జోస్యం చెబుతున్నాడు..అయ్యా జేసీ గారు…నువ్వున్నట్లు 2024లో కాదు అటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో, ఇటు నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో చంద్రబాబే వరస్ట్ సీఎంగా నిలబడిపోతారని నెట్‌జన్లు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చంద్రబాబుపై జేసీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat